![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1088 లో.. నేను నీ అత్తయ్య కొడుకుని నువ్వు నాతో సరదాగా ఉండాలనుకుంటున్నావు.. ఉంటున్నావ్ అది అందరి జీవితంలో ఉంటాయి.. నా జీవితంలో కాదని మను అంటాడు. నీ జీవితంలో ఎందుకు ఉండవ్.. నువ్వు మనిషివి కదా.. నీలా ఎవరు ఉండరని ఏంజిల్ అంటుంది. అదే నేను చెప్తున్నాను.. ఇప్పుడు నా గురించి క్లారిటీ ఇస్తాను. అర్థం చేసుకో.. నేను ఎవరికి దగ్గరవుతానో వాళ్ళతో నాకు విపరీతమైన ఘర్షణ ఏర్పాడుతుంది. నాకు పర్మినెంట్ గా దూరం అవుతారని మను అనగానే.... అంటే నేను దూరం అయిపోతానని నువ్వు బయపడుతున్నావా.. బాధపడుతున్నావా అని ఏంజిల్ అంటుంది.
అది కాదు.. నా ప్రపంచం వేరేనని మను అనగానే.. అంటే నీది ఏ ప్రపంచమని ఏంజిల్ సరదాగా మాట్లాడుతుంది. ఇప్పుడు నీ మనసులో నా గురించి ఉన్న ఆలోచన తీసేయ్ అని మను అంటాడు. అంటే నా మనసులో నీ గురించి ఏ ఆలోచన ఉందనుకుంటున్నావు.. నా మీద నీకు ఏ ఆలోచనుంది.. నువ్వు ఏమైనా హ్యాండ్ సమ్ అనుకుంటున్నావా.. గ్రీకు వీరుడు అనుకుంటున్నావా అని ఏంజిల్ అనగానే.. నా మీద నాకు ఏదైనా ఉంటుంది కానీ నువ్వు ఏదైనా అనుకుంటేనే ప్రాబ్లమ్ నా గురించి నువ్వు అలా భావిస్తేనే ప్రాబ్లమ్.. నా మాట విని మన పరిచయం పరిచయంలాగే ఉంచు.. బంధం లాగా మార్చాలని చూడకు ప్లీజ్ అని మను అంటాడు. నువ్వు ఏది చెప్పినా నేను వినను.. నా ఆలోచన కూడా మార్చుకోను.. నా గురించి నీకు తెలియదు. నువ్వు ఇలాంటివి చెప్తే నేను వినను.. నాలా థింక్ చెయ్యడం నేర్చుకో పోరా అని ఏంజిల్ అనగానే.. పోరానా అని మను అంటాడు. బావ అంటే వద్దన్నావ్ కదా.. అందుకే 'రా' అంటున్నానని ఏంజిల్ అంటుంది.
మరొకవైపు శైలేంద్ర ఎలాగైన వాళ్ళని దెబ్బకొట్టాలని ఒక ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత వసుధారకి ఎవరో ఫోన్ చేసి.. స్టోర్ రూమ్ లో స్టూడెంట్స్ గొడవపడుతున్నారని చెప్పగానే వసుధార వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే స్ప్రై ఇస్తారు. దాంతో వసు స్పృహ కోల్పోతుంది. వసుధార ఫోన్ నుండి మనుకి ట్రబల్ లో ఉన్నానని మెసేజ్ చేస్తారు. అప్పుడే వెంటనే వసుధార దగ్గరికి వెళ్తాడు. బయటనుండి ఎవరో లాక్ గడియపెడతారు. ఆ తర్వాత అందరు స్టూడెంట్స్ లోపల ఎవరో ఉన్నారంటూ గది ముందుకి వస్తారు. శైలేంద్ర, మహేంద్ర కూడా వస్తారు. డోర్ తెరిచి చూసేసరికి అక్కడ ఏంజిల్ ఉంటుంది. దాంతో శైలేంద్ర షాక్ అవుతాడు. వసుధార, మను ఉండాలి కదా అని ఆలోచిస్తాడు. లోపల ఉండగా డోర్ పెట్టింది ఎవరని ఏంజిల్ తిడుతుంది. ఆ తర్వాత ఇదంతా నీ ప్లాన్ అని తెలుసని శైలేంద్రతో మను అంటాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. మరొకవైపు వసుధార స్పృహలో నుండి బయటకు వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |